

డిపోలు/యూనిట్లలో మెడికల్ అన్-ఫిట్ అయిన ఉద్యోగుల ప్రత్యామ్నాయ ఉపాధి మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి విడుదల చేసిన ముఖ్యమైన సూచనలు.
తేదీ 01-01-2020 తర్వాత మెడికల్ అన్-ఫిట్ అయిన వారు.
ప్రస్తుతానికి వయస్సు 62 సంవత్సరాల లోపు ఉన్నవారు.
ప్రస్తుతం సర్వీసులో ఉండి జి.వో 661 మేరకు జబ్బులు ఉన్నవారు (వీరిని జి.జి.హెచ్ బోర్డుకు పంపుతారు).
ప్రత్యామ్నాయ ఉద్యోగం కావాలనుకుంటే: వెంటనే డిపో లేదా యూనిట్ ఆఫీసర్‌కు విల్లింగ్ లెటర్ (Willing Letter) వ్రాసి ఇవ్వాలి. (గమనిక: వరుసగా సెలవులు ఉన్నందున అప్రమత్తంగా ఉండి త్వరగా సమర్పించాలి).
ప్రత్యామ్నాయ ఉద్యోగం వద్దనుకుంటే: మానిటరీ బెనిఫిట్ (Monetary Benefit) మొత్తం కావాలని లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసి ఇవ్వవచ్చు.
మెడికల్ బోర్డుకు రిఫరల్: ఉద్యోగం కోసం విల్లింగ్ ఇచ్చిన వారిని విజయవాడలోని మెడికల్ బోర్డుకు పంపుతారు.
వ్యాధుల నిర్ధారణ: RPwD Act 2016 ప్రకారం నిర్దేశించిన 21 వ్యాధులు ఉన్నవారికి మాత్రమే బోర్డు వారు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని సిఫార్సు చేస్తారు. ఒకవేళ ఆ 21 జబ్బుల జాబితాలో లేకపోతే అదనపు మానిటరీ బెనిఫిట్‌కు అనుమతిస్తారు.
కలెక్టర్ పూల్‌కు సిఫార్సు: ఒకవేళ బోర్డులో అన్-ఫిట్ అని తేలితే.. తదుపరి పూర్వపు ఆర్.ఎం (RM) ద్వారా కలెక్టర్ పూల్ కు సిఫార్సు చేస్తారు.
వేతనం (Basic Pay): మెడికల్ బోర్డు ద్వారా సిఫార్సు చేయబడిన వారికి, పూర్వపు ఆర్.ఎం గారి ద్వారా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కేటాయిస్తారు. వారు రిటైర్ అయినప్పుడు ఏ బేసిక్ పే అయితే ఉందో, అదే బేసిక్ పేతో కొనసాగిస్తారు.
సీనియారిటీ ప్రాతిపదిక: ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కేవలం సీనియారిటీ పద్ధతిపై మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలు భర్తీ అయ్యాక, భవిష్యత్ ఖాళీలను బట్టి మిగతా వారిని నియమిస్తారు.
లీవులు: రిటైర్ అయినప్పటి నుండి తిరిగి డ్యూటీలో రిపోర్ట్ చేసే వరకు ఉన్న పీరియడ్‌కు (ఖాతాలో లీవులు ఉంటే) వాటిని లీవుగానే పరిగణిస్తారు.
డబ్బు వాపసు (Repayment): మెడికల్ అన్-ఫిట్ అయి, ఫైనల్ సెటిల్మెంట్ (గ్రాట్యుటీ, లీవులు తదితర) డబ్బులు తీసుకున్న వారు, తిరిగి ప్రత్యామ్నాయ ఉద్యోగంలో చేరేటప్పుడు ఆ డబ్బును విధిగా తిరిగి చెల్లించాలి.
పీఎఫ్ (PF): పీఎఫ్ డబ్బులు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఉద్యోగంలో చేరినప్పటి నుండి మళ్లీ అమలు చేస్తారు.
అదనపు మానిటరీ బెనిఫిట్: సర్వీసు పూర్తయిన వారికి మరియు చనిపోయిన వారికి అదనపు మానిటరీ బెనిఫిట్ ఇస్తారు. జి.వో 661 ప్రకారం అన్-ఫిట్ అయిన వారు అదనపు మానిటరీ మొత్తం కావాలంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
కండక్టరు (Conductor): వీరికి SSC (10వ తరగతి) పాస్ అయి ఉండాలి మరియు ఎత్తు కనీసం 153 సెం.మీ. ఉండాలి. (ఖాళీలు: 1,057)
శ్రామిక్ (Shramik): వీరికి ITI విద్యార్హత ఉండాలి. (ఖాళీలు: 434)
రికార్డు ట్రేసర్ (Record Tracer): వీరికి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. (ఖాళీలు: 23)
ఈ ప్రక్రియ అంతటినీ తేదీ: 28-02-2026 లోగా పూర్తి చేస్తారు.